సికిల్‌ సెల్‌ వ్యాధితో జీవించేందుకు సహాయపడే సూచనలు

సికిల్‌ సెల్‌ వ్యాధితో
జీవించేందుకు
సహాయపడే సూచనలు

సికిల్‌ సెల్‌ వ్యాధితో జీవించేందుకు సహాయపడే సూచనలు

చిన్న చర్యలు వ్యత్యాసం తీసుకురావచ్చు

సికిల్‌ సెల్‌ వ్యాధి భావోద్వేగ అనుభూతి కల్పించనున్నప్పటికీ, ఈ కింది సూచనలు సాయపడవచ్చు:

చికిత్స చేయించుకొనుట
 • సికిల్‌ సెల్‌ వ్యాధి లాంటి రక్తం అవ్యవస్థల గురించి మంచి నైపుణ్యం ఉన్నట్లుగా బాగా తెలిసిన హెమటాలజిస్టును సంప్రదించవలసిందిగా సిఫారసు చేయడమైనది. ఎవ్వరూ అందుబాటులో లేకపోతే, మీ ప్రాథమిక డాక్టరును సంప్రదించండి
 • సికిల్‌ సెల్‌ వ్యాధిని అదుపుచేయడం గురించి రెగ్యులర్‌గా డాక్టరుతో మాట్లాడండి. నొప్పి కలిగినప్పుడు దానిని మెరుగ్గా అదుపుచేసేందుకు సహాయపడే ప్రణాళిక అతని లేదా ఆమె వద్ద ఉండొచ్చు
 • నొప్పి సంఘటనలు కలిగినప్పుడు, వెంటనే మీ డాక్టరును సంప్రదించండి లేదా వైద్య సహాయం తీసుకోండి. మీకు మీరుగా నొప్పి సంఘటనను సహించవలసిన పని లేదు
 • మీరు అత్యవసర శాఖకు వెళితే లేదా నొప్పిని ఇంట్లో అదుపుచేయడానికి ప్రయత్నిస్తే, మీరు తప్పకుండా మీ డాక్టరుకు తెలియజేయండి
ఆరోగ్యంగా ఉండండి
 • మీ చేతులు కడుక్కోండి, సుక్షితంగా తయారు చేసిన మరియు ఆరోగ్యకరమైన ఆహారం తినండి, సుస్తీ కలగకుండా ఉండేందుకు టీకాలు వేయించుకోండి
 • చాలా వేడి లేదా చాలా చల్లని ఉష్ణోగ్రతలకు గురవ్వడాన్ని నివారించడానికి ప్రయత్నించండి
 • జలీకరణతో ఉండండి (రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీళ్ళు తాగండి)
మీ గురించి జాగ్రత్త తీసుకోండి
 • మీరు ఒక్కరే కాదనే విషయం గుర్తుంచుకోండి- సికిల్‌ సెల్‌ వ్యాధి యొక్క భావోద్వేగ మరియు సామాజిక మార్పులతో కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు మీకు సహాయపడగులుతారు
 • సపోర్టు గ్రూపులో చేరడాన్ని పరిగణించండి, సికిల్‌ సెల్‌ వ్యాధితో జీవించడం గురించిన సూచనలు పంచుకోండి
 • ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి, పుష్కలంగా విశ్రాంతి తీసుకోండి మరియు వ్యక్తిగత వ్యాయామ ప్రణాళిక తయారుచేసేందుకు డాక్టరుతో పనిచేయండి

మీ డాక్టరుతో సానుకూలంగా ఉండండి

మీగల ఏవైనా ఆందోళనలు లేదా ప్రశ్నలపై నోట్స్‌ని ముందుగానే తయారుచేసుకొని డాక్టరు సందర్శనలకు తయారవ్వండి. డాక్టరుతో నిజాయితీగా మాట్లాడండి.

మీ సికిల్‌ సెల్‌ వ్యాధిని అదుపుచేసే విషయానికొస్తే, మీ డాక్టరుకు మనసు విప్పి నిజాయితీగా మాట్లాడటం ముఖ్యం.

Mark
మీ డాక్టరుకు ఈ కిందివి చెప్పడం ద్వారా ప్రారంభించడం సహాయకారిగా ఉంటుంది:
 • నొప్పి సంఘటనలు మీ శరీరం, మనసు మరియు సామాజిక జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తోంది
 • మీరు ఎన్ని నొప్పి సంఘటనలు అనుభవించారు

శిశు నుంఇచ వయోజన సంరక్షణకు మారిపోవడం

మీరు సికిల్‌ సెల్‌ వ్యాధి గల తల్లిదండ్రి లేదా సంరక్షకుడు అయితే, సంధికాల ప్రణాళిక ఉండటం, వయోజన సంరక్షణలోకి వెళ్ళడానికి సహాయపడవచ్చు. డాక్టర్లతో మరియు ఇతర ఆరోగ్య సంరక్షణ అందించేవారితో పనిచేయడం సంధికాల ప్రక్రియకు సహాయపడవచ్చు.

చర్య యొక్క సంధికాల ప్రక్రియ సిఫారసులు

12-13 సంవత్సరాల వయస్సు రోగులు మరియు ఆరోగ్య సంరక్షణ అందించేవారు సందికాల ప్రణాళికను చర్చించడం ప్రారంభించాలి. 14-15 సంవత్సరాల వయస్సు రోగులు తాము తీసుకుంటున్న మందులు మరియు మోతాదులు తెలుసుకోవాలి. 16-17 సంవత్సరాల వయస్సు రోగులు మరియు ఆరోగ్య సంరక్షణ అందించేవారు కొత్త వయోజన సంరక్షణను అందించేవారిని గుర్తించడం ప్రారంభించాలి. ≥ 18 సంవత్సరాల వయస్సు రోగులు కొత్త వయోజన సంరక్షణను అందించేవారిని సందర్శించడం ప్రారంభించాలి. 12-13 సంవత్సరాల వయస్సు రోగులు మరియు ఆరోగ్య సంరక్షణ అందించేవారు సందికాల ప్రణాళికను చర్చించడం ప్రారంభించాలి. 14-15 సంవత్సరాల వయస్సు రోగులు తాము తీసుకుంటున్న మందులు మరియు మోతాదులు తెలుసుకోవాలి. 16-17 సంవత్సరాల వయస్సు రోగులు మరియు ఆరోగ్య సంరక్షణ అందించేవారు కొత్త వయోజన సంరక్షణను అందించేవారిని గుర్తించడం ప్రారంభించాలి. ≥ 18 సంవత్సరాల వయస్సు రోగులు కొత్త వయోజన సంరక్షణను అందించేవారిని సందర్శించడం ప్రారంభించాలి.

సంధికాలం గురించి మీ శిశువు యొక్క పిల్లల డాక్టరుతో మాట్లాడేందుకు సూచనలు:

 • సంబంధిత వైద్య చరిత్ర మొత్తాన్ని చర్చించండి (ఆసుపత్రిలో చేరడం, నొప్పి సంఘటనలు, ట్రాన్స్‌ఫ్యూజన్‌లు); మీ ప్రాథమిక డాక్టరు సమాచారాన్ని అందుబాటులో ఉంచాలి
 • మీ శిశువు మందుల పేర్లు లేదా అతను లేదా ఎంత మొత్తంలో తీసుకుంటున్నారో తెలుసుకోండి; అపాయింట్‌మెంట్‌కి వాళ్ళ మందులను మీతో ఆసుపత్రికి తీసుకురండి
 • మీ శిశువుకు గల ఏవైనా లక్షణాలను చర్చించండి

మీకు ఒంటరిగా అనిపించిన సమయాల్లో మద్దతు ఉండటం ముఖ్యం

సికిల్‌ సెల్‌ వ్యాధి గల ప్రజలకు వాళ్ళు ఆధారపడదగిన కుటుంబం మరియు స్నేహితులు ఉన్నప్పుడు తక్కువ భారం అనిపించవచ్చు. ఇతరులు ఇవ్వగల సహాయాన్ని తక్కువగా అంచనావేయకండి.

3. భావోద్వేగ మరియు సామాజిక మద్దతు గల నెట్‌వర్క్‌ని మీరు నిర్మించుకోవడానికి సహాయపడే పరిగణించవలసిన సూచనలు.
 • 1. మీకు భావోద్వేగంగా ఎలాంటి అనుభూతి కలుగుతోంది మరియు నొప్పి సంఘటనలను మీరు ఎలా అనుభవిస్తున్నారనే దాని గురించి డాక్టరుతో మాట్లాడండి
 • 2. సికిల్‌ సెల్‌ యొక్క భావోద్వేగ మరియు సామాజిక సవాళ్ళను మీరు హ్యాండిల్‌ చేయడానికి సహాయపడే వారిని సంప్రదించండి
 • 3. సికిల్‌ సెల్‌ కమ్యూనిటిలోని ఇతర ప్రజలతో కనెక్షన్‌లను ఆన్‌లైన్‌ చేయండి

సికిల్‌ సెల్‌పై చేసిన మరింత పరిశోధన, ఈ స్థితికి అంతర్లీనంగా ఉన్న కారణాలను మెరుగ్గా అర్థంచేసుకునేందుకు మరియు సంభావ్య థెరపిలను సృష్టించేందుకు దారితీసింది. మీరు ఒక్కరే కాదనే విషయం గుర్తుంచుకోండి. ప్రపంచవ్యాప్తంగా సికిల్‌ సెల్‌ వ్యాధి వల్ల ప్రభావితమైన ప్రజలకు సపోర్టు గ్రూపులు ఉన్నాయి. ఏదైనా ఒకదానిని కనుగొనేందుకు సహాయం అవసరమా? ఏవైనా గ్రూపులు తెలుసా అనే విషయం మీ డాక్టరును అడగండి. మీ ప్రాంతంలోని సంస్థలకు వాళ్ళు మిమ్మల్ని కనెక్ట్‌ చేయవచ్చు.

సహాయపడే వనరులు లభిస్తున్నాయి

ఇప్పుడు మీరు NotAloneInSickleCell.com ని వదిలి వెళుతున్నారు.

మీరు NotAloneInSickleCell.com వెబ్‌సైట్‌ని వదిలివెళ్ళబోతున్నారు మరియు మూడవ పక్షం ఆపరేట్‌చేస్తున్న వెబ్‌సైట్‌లోకి ప్రవేశించబోతున్నారు. ఈ మూడవ పక్షం వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం బాధ్యత నోవార్టిస్‌ది కాదు మరియు నియంత్రించడం లేదు.